మన డబ్బులతో చైనాను బతికించాలా?: హర్భజన్ సింగ్
- ఎట్టి పరిస్థితుల్లో చైనా వస్తువులు వాడవద్దు
- నేను చైనా ప్రొడక్టులను ప్రమోట్ చేయడం లేదు
- వస్తు ఉత్పత్తులను ఇండియాలోనే తయారు చేసుకుందాం
- ఆ శక్తి మనకుందన్న హర్భజన్ సింగ్
ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా వస్తువులను వాడరాదని, అన్ని రకాల చైనా ప్రొడక్టులను నిషేధించాలని మాజీ క్రికెటర్, బౌలర్ హర్భజన్ సింగ్ సూచించారు. గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలు భారతీయులందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తూ, చైనా వస్తువులను వాడరాదన్న ప్రచారం ఊపందుకున్న వేళ హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియాపై దాడులకు దిగుతున్న చైనాను మన డబ్బులతో బతికించాల్సిన అవసరం లేదని, చైనా వస్తువులను బహిష్కరించాలని అన్నారు. చైనా వస్తువులకు పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్న వేళ, తాను ఏ విధమైన చైనా ప్రొడక్టులనూ ప్రమోట్ చేయడం లేదని, ఆ జాబితాలో తాను లేనని అన్నారు. ఇండియా స్వావలంబన సాధించాలంటే, చైనా ప్రొడక్టులను వాడకుండా వదిలేయాలని, అన్ని రకాల వస్తు ఉత్పత్తులనూ ఇక్కడే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు కావాల్సిన శక్తి ఇండియన్స్ వద్ద ఉందని అన్నారు.