మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రధాని కార్యాలయం ప్రకటన
- సరిహద్దుల్లోకి ఎవరూ చొరబడలేదన్న మోదీ
- ప్రతిపక్షాల విమర్శలు
- మోదీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని అంటగట్టే యత్నాలన్న పీఎంవో
- నిర్మాణాలు చేపట్టడంలోనూ చైనా వెనకడుగు
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వద్ద భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటోన్న విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు విషయాలు తెలుపుతూ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలపై ప్రధాని కార్యాలయం ఈ రోజు ప్రకటన విడుదల చేసి వివరణ ఇచ్చింది. దేశ సరిహద్దుల్లోకి ఎవరూ చొరబడలేదని మోదీ చేసిన వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని అంటగట్టే యత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.
ఇటీవల గాల్వన్ లోయ ప్రాంతంలో 20 మంది భారత జవాన్లు అమరులైన అనంతరం నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి మోదీ ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. చైనా కుట్రలను మన సైనికుల బలిదానాలు తిప్పికొట్టాయని పీఎంవో చెప్పింది. చొరబాటు విషయంలో చైనా చివరకు వెనక్కి తగ్గిందని పేర్కొంది. అంతేగాక, ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలన్న విషయంలోనూ చైనా వెనకడుగు వేసిందని చెప్పింది.