ఏపీలో పది పరీక్షల రద్దు?.. కాసేపట్లో కీలక ప్రకటన
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం
- ఏపీలో పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది
- పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్?
- ఈ రోజు సాయంకాలం మంత్రి సురేశ్ మీడియా సమావేశం
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై కాసేపట్లో కీలక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. పరీక్షలను రద్దు చేయాలనే ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ చర్చించారు. ఈ రోజు సాయత్రం ఆయన ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించి ప్రకటన చేయనున్నారు. ఏపీలో పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.