జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు

  • వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో విచారణ
  • ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌లో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డి
  • అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కాసేపట్లో తరలింపు
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డి కడప కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరినీ పోలీసులు విచారించనున్నారు. వారిని రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అనంతపురం కోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌లో ఉన్న వారిద్దరినీ కడప జైలు నుంచి అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు పోలీసులు వచ్చారు. మొత్తం 8 మంది అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు జైలు అధికారులతో ఈ విషయంపై చర్చిస్తున్నారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై ఆర్టీఏ అధికారులు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.


More Telugu News