చైనా ఉత్పత్తులను బహిష్కరించడం సమస్యకు పరిష్కారం కాదు: చిదంబరం కీలక వ్యాఖ్యలు
- మనం స్వయం సమృద్ధి సాధించాలి
- ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాలి
- చైనాకు ప్రపంచంతో ఉన్న వాణిజ్య సంబంధాలు తక్కువేం కాదు
- వాటితో పోల్చి చూస్తే ఆ దేశానికి భారత్‌తో వాణిజ్యం ఏపాటిది?
భారత్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించడం సమస్యకు పరిష్కారం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చిదంబరం ఈ విషయంపై స్పందిస్తూ... భారత్‌లో తప్పకుండా స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు. అయితే, అదే సమయంలో ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాలని హితవు పలికారు. చైనా ఉత్పత్తులను దేశంలో బహిష్కరించకుండా మనం గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో భాగస్వామిగా కొనసాగాలని తెలిపారు.
చైనాకి ప్రపంచంతో ఉన్న వాణిజ్య సంబంధాలతో పోల్చి చూస్తే ఆ దేశానికి భారత్‌తో వాణిజ్యం ఏపాటిదని చిదంబరం నిలదీశారు. ఆ దేశ ఉత్పత్తులను భారత్‌లో బహిష్కరిస్తే డ్రాగన్ దేశ ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టం అంతగా ఉండదని చెప్పారు. చైనా వస్తువుల బహిష్కరణ వంటి చిన్న విషయాలను లేవనెత్తి సమయాన్ని వృథా చేయొద్దని, దేశ భద్రత గురించి చర్చించాలని చెప్పారు.