పోలీసుల్లో మహమ్మారి కలకలం... ఇద్దరు హైదరాబాద్ ఐపీఎస్ లకు కరోనా!
- నిన్న మొన్నటి వరకూ కింది స్థాయికే పరిమితం
- ఇప్పుడు ఓ మహిళా అధికారి సహా మరొకరికి పాజిటివ్
- అధికారులను కలవరపెడుతున్న మహమ్మారి
నిన్నమొన్నటి వరకూ తెలంగాణలో కింది స్థాయి సిబ్బందికి మాత్రమే పరిమితమైన కరోనా వైరస్, ఇప్పుడు ఉన్నతాధికారులను సైతం వణికిస్తోంది. ఇప్పటికే ఓ రాష్ట్ర ఐపీఎస్ అధికారికి కరోనా సోకగా, తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో వీరి దగ్గర పనిచేస్తున్న గన్ మెన్ లను, ఇతర సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. వైరస్ సోకిన ఇద్దరు ఐపీఎస్ అధికారుల్లో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. ఇదే సమయంలో డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ స్థాయి అధికారి వద్ద పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకడంతో, ఆయన్ను హోమ్ క్వారంటైన్ చేశారు.
ఇదిలావుండగా, ఇటీవల బంజారాహిల్స్ పీఎస్ లో పనిచేస్తున్న 20 మందికి కరోనా సోకిందన్న సంగతి తెలిసిందే. సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరికి కూడా వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పోలీసు శాఖలోనే కలకలం రేగింది. వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తుండటం, మహమ్మారిపై పోరాటంలో వైద్యులతో పాటు ముందు నిలిచిన పోలీసుల అధికారులకు వైరస్ సోకుతుండటం అధికారులను కలవరపెడుతోంది.