మద్యం హోమ్ డెలివరీకి అమెజాన్, బిగ్ బాస్కెట్ లకు అనుమతించిన పశ్చిమ బెంగాల్!

  • ఇండియాలో తొలిసారిగా అనుమతించిన వెస్ట్ బెంగాల్
  • సడలింపుల అనంతరం పెరుగుతున్న కేసులు
  • కీలక నిర్ణయం తీసుకున్న మమత సర్కారు
ఇంటింటికీ మద్యం ఉత్పత్తులను చేర్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్ బాస్కెట్ లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతించింది. ఇండియాలో ఓ రాష్ట్ర ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీకి అనుమతించడం ఇదే తొలిసారి. ఈ మేరకు వెస్ట్ బెంగాల్ స్టేట్ బీవరేజస్ కార్పొరేషన్ నుంచి అనుమతులు వచ్చాయని అమెజాన్ స్పష్టం చేసింది.

కాగా, ఇండియాలో అత్యధికంగా జనాభా ఉన్న 4వ రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా, కరోనా, లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టపోయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, నిబంధనల సడలింపు అనంతరం కొత్త కేసులు పెరుగుతుండగా, మమతా బెనర్జీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.


More Telugu News