కరోనా లక్షణాల్లో మరోటి చేరిక.. కళ్లు ఎర్రబారడమూ అందుకు సంకేతమే!
- కళ్లు ఎర్రబారితే కోవిడ్ పరీక్షలు చేయాలి
- కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటన్న కెనడా ప్రొఫెసర్
- 10-15 శాతం మందిలో ఈ లక్షణాలు
కరోనా లక్షణాల్లో మరోటి వచ్చి చేరింది. ఇప్పటి వరకు దగ్గు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసనను గ్రహించకపోవడం వంటివి కరోనా లక్షణాల్లో ఉండగా తాజాగా, కళ్లు ఎరుపెక్కడం కూడా కరోనా లక్షణమేనని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోస్ సోలర్టె పేర్కొన్నారు.
కళ్లు ఎర్రబారిన ఓ మహిళ కంటి సమస్య అనుకుని తమ వద్దకు వచ్చిందని, తాము కూడా కంటి సమస్యే అని భావించామని ఆయన తెలిపారు. అయితే, అది కంటి సమస్య కాదని, కరోనా కేసుగా తేలిందని పేర్కొన్నారు. కరోనా బాధితుల్లో పదిపదిహేను శాతం మందిలో కళ్లు ఎర్రబారడం, కండ్ల కలక వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని వివరించారు. ఈ సమస్యతో ఎవరైనా తమ వద్దకు వస్తే వారిని కోవిడ్ పరీక్షలకు పంపాలని ఆయన సూచించారు.