అసోంలో విషాదం... పారిపోయే ప్రయత్నంలో కరోనా రోగి దుర్మరణం
- దీస్ పూర్ లో ఘటన
- కరోనా సోకిన వ్యక్తి క్వారంటైన్ కు తరలింపు
- గోడ దూకే యత్నంలో కిందపడడంతో తలకు బలమైన గాయాలు
క్వారంటైన్ లో ఉన్న కరోనా రోగులు, అనుమానితులు బయటికి వెళ్లకుండా కట్టుదిట్టం చేయడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతుంది. క్వారంటైన్ కేంద్రాల నుంచి రోగులు తప్పించుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, అసోంలో ఇలాంటి ప్రయత్నమే జరగ్గా, కరోనా రోగి దుర్మరణం పాలవడం కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది.
దీస్ పూర్ లో ఓ వ్యక్తిని కరోనా కారణంగా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే, ఆ వ్యక్తి క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయే ప్రయత్నంలో ఎత్తైన గోడ దూకుతూ తీవ్రంగా గాయపడ్డాడు. కిందపడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో మరణించాడు. అతడు కరోనా రోగి అయినా, ప్రమాదవశాత్తు మరణించడంతో దీన్ని కరోనా మరణాల జాబితాలో చేర్చడంలేదని అసోం అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.