భార్యను బ్లాక్ మెయిల్ చేసి రూ.కోటి వసూలు చేసిన భర్త
- స్నేహితుడి పేరిట భార్యకు అశ్లీల వీడియోలు, సందేశాలు
- భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
- పోలీసుల విచారణలో నిజాలు చెప్పేసిన భర్త
వైవాహికబంధాలు పలుచన అవుతున్న ఘటనల్లో ఇదొకటి! కట్టుకున్న భార్యను బ్లాక్ మెయిల్ చేసిన ఓ ప్రబుద్ధుడు రూ.కోటి వసూలు చేసిన ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలిలో వెలుగుచూసింది. సంతోష్ అనే యువకుడు భార్యను డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తూ ఇప్పుడు కటకటాల వెనక్కి చేరాడు. సంతోష్ భార్య ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వ్యసనాలకు బానిసైన సంతోష్ భార్యను నిత్యం వేధించేవాడు. చివరికి డబ్బు కోసం నీచమైన ఎత్తుగడ వేశాడు.
స్నేహితుడి పేరుతో భార్యకు అశ్లీల సందేశాలు, వీడియోలు పంపేవాడు. ఆ అసభ్య వీడియోలు, సందేశాల ఆధారంగా భార్యను బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయల వరకు రాబట్టాడు. అయితే ఇది ఎవరి పనో అర్థంకాక ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరికి భర్తపై అనుమానం కలగడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సంతోష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించేసరికి అన్ని విషయాలు వెల్లడించాడు. ఇదే తరహాలో అతడు గతంలో కొంతమంది మహిళలతో వ్యవహరించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ప్రస్తుతం సంతోష్ రిమాండ్ లో ఉన్నాడు.