వైసీపీ ఘనవిజయం... ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలూ కైవసం

  • ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్
  • మోపిదేవి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, నత్వానీ విజయం
  • టీడీపీ నేత వర్ల రామయ్యకు నిరాశ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ ఘనవిజయం అందుకుంది. అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే నెగ్గారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో దిగిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, 'అయోధ్య' రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు.

కాగా, టీడీపీ తరఫున బరిలో దిగిన వర్ల రామయ్యకు నిరాశ తప్పలేదు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఇవాళ వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టి 6 గంటలకు ఫలితాలు వెల్లడించారు.


More Telugu News