చైనాతో ఉద్రిక్తతలపై మోదీకి చంద్రబాబు సలహా ఇచ్చారంటూ ట్వీట్‌ వైరల్‌.. మండిపడ్డ చంద్రబాబు

  • మార్ఫింగ్‌ ఫొటోలు సృష్టిస్తున్నారన్న చంద్రబాబు
  • వైసీపీ పనేనని ఆగ్రహం
  • ఇతరుల ప్రతిష్టను దిగజార్చే ఆలోచనలు
  • ఫేక్ పోస్టులు చిరాకు తెప్పించేలా ఉన్నాయని వ్యాఖ్య
తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారని, చైనా-భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తాను ఓ సలహా ఇచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసినట్లు ఓ మార్ఫింగ్ ఫొటో వైరల్ అవుతోంది.

తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో తనపై సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యాప్తి చేసిన ఈ వార్తపై  చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్‌తో పాటు ఆయన చుట్టూ ఉండే నేరస్థులే ఇటువంటి మార్ఫింగ్‌ ఫొటోలు సృష్టిస్తూ ఇతరుల ప్రతిష్టను దిగజార్చడం, అవమానించడం వంటి చర్యలకు పాల్పడే ఆలోచనలు చేస్తుంటారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ వ్యాప్తి చేస్తోన్న ఇటువంటి ఫేక్ పోస్టులు చిరాకు తెప్పించేలా ఉన్నాయని చెప్పారు.


More Telugu News