హర్యానాలో 24 గంటల్లో రెండోసారి కంపించిన భూమి
- ఈ తెల్లవారుజామున 5:37 గంటల ప్రాంతంలో భూకంపం
- భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
- తీవ్రత 5 కంటే తక్కువ ఉంటే భయపడాల్సిన పని లేదంటున్న నిపుణులు
హర్యానాలో 24 గంటల్లో రెండోసారి భూమి కంపించింది. ఈ ఉదయం 5:37 గంటలకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైంది. తూర్పు- ఆగ్నేయంలోని 15 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. కాగా, నిన్న తెల్లవారుజామున 4 గంటలకు ఒకసారి ఆగ్నేయ రోహ్‌తక్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 2.1గా నమోదైంది. భూకంప తీవ్రత 5 కంటే తక్కువగా ఉంటే పెద్ద ప్రమాదమేమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు.