సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కీర్తి సురేశ్ కన్ఫర్మ్ చేసేసింది!
- పవన్-క్రిష్ సినిమా అప్ డేట్
- కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా
* మహేశ్ హీరోగా నటించే 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా కీర్తి సురేశ్ ఖరారైంది. ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఇన్ స్టా లైవ్ లో అభిమానులతో పంచుకుంది. పరశురాం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
* పవన్ కల్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రాన్ని చేస్తున్నారు. దీని తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయాల్సి వుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగులన్నీ నిలిచిపోవడంతో క్రిష్ సినిమా కూడా ముందుకి వెళ్లింది. దీంతో దీనిని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా చిత్ర నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారట.
* కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తెలుగులో ఓ సినిమా రూపొందనుంది. 'పలాస 1978' చిత్రం ద్వారా హీరోగా పేరుతెచ్చుకున్న రక్షిత్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. WHO (వరల్డ్ హజార్డ్ ఆర్డినెన్స్) అనే టైటిల్ ని కూడా దీనికి నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా దేవ్ పిన్నమరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.