ఏపీ టూరిజం శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ నియామకం

  • మూడేళ్ల కిందట ఇండోనేషియా ఓపెన్ టైటిల్ నెగ్గిన కిదాంబి
  • గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామన్న అప్పటి చంద్రబాబు సర్కారు
  • టూరిజం విభాగంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో నియమించిన వైసీపీ ప్రభుత్వం
భారత బ్యాడ్మింటన్ రంగంలో పుల్లెల గోపీచంద్ తర్వాత అంతటి ఆశలు కలిగిస్తున్న ఆటగాడు కిదాంబి శ్రీకాంత్. ఈ తెలుగుతేజం మూడేళ్ల కిందట ఇండోనేషియాలో జరిగిన సూపర్ సిరీస్ ఓపెన్ టైటిల్ గెల్చి ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. దాంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కిదాంబి శ్రీకాంత్ కు గ్రూప్-1 హోదాతో ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో నియమించింది.

ఈ నేపథ్యంలో సంబంధిత ఉద్యోగానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసుకున్న కిదాంబి శ్రీకాంత్ ను ఏపీ టూరిజం అథారిటీలో డిప్యూటీ డైరెక్టర్  గా నియమిస్తూ వైసీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. జపాన్ లో జరగనున్న ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేందుకు వెసులుబాటు కూడా కల్పించింది. బ్యాడ్మింటన్ శిక్షణ పొందే కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.


More Telugu News