చెయ్యేస్తే గమ్మునుండేందుకు మేము గాంధీలం కాదు: బీద రవిచంద్ర

  • ఏపీ శాసనమండలిలో నిన్న ఉద్రిక్తత
  • మంత్రులు దాడి చేసేందుకు వచ్చారన్న బీద రవిచంద్ర
  • మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశామని వెల్లడి
ఏపీ శాసనమండలిలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమపై దాడికి పాల్పడ్డారంటూ ఇరు పక్షాలు చెపుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన ఫుటేజ్ మాత్రం బయటకు రాలేదు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ, తమపై చేయివేస్తే గమ్మున ఉండాలా? అని ప్రశ్నించారు. చేయివేస్తే గమ్మున ఉండేందుకు తాము గాంధీలము కాదుకదా? అని అన్నారు.

శాసనమండలిలో జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫుటేజీని బయటపెట్టాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. ఫుటేజ్ బయట పెడితే ఎవరు ఏం చేశారో అందరికీ తెలుస్తుందని చెప్పారు. మండలిలో ఘర్షణకు మంత్రుల తీరే కారణమని అన్నారు. విపక్ష సభ్యులను మంత్రులు బూతులు తిట్టారని... లోకేశ్ పై దాడి చేసేందుకు వచ్చారని... వారిపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మండలిలో జరిగిన ఘటనలు ఎవరికీ గౌరవం కలిగించేవి కాదని అన్నారు.


More Telugu News