అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త.. శబరిమల విమానాశ్రయ పనులు ప్రారంభం!
- 2,263 ఎకరాల భూసేకరణకు ఉత్తర్వులు జారీ
- కొట్టాయం జిల్లా కలెక్టర్ కు బాధ్యతల అప్పగింత
- 'శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్' ఏర్పాటుకు సన్నాహకాలు
శబరిమలకు వెళ్లే భక్తులలో అత్యధికులు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తుంటారు. ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప దీక్షను ఆచరించి, ఆయన దర్శనం చేసుకుని వస్తుంటారు. ఇకపై అయ్యప్ప భక్తుల ప్రయాణం మరింత సులభం కానుంది. శబరిమల విమానాశ్రయం కోసం భూసేకరణ చేసేందుకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2,263 ఎకరాల భూమిని సేకరించాలంటూ కేరళ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి జయతిలక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యతను కొట్టాయం జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.
భూ సేకరణ, పునరావాస చట్టం 2013 ప్రకారం విమానాశ్రయానికి అవసరమైన స్థలాన్ని సేకరించనున్నారు. విమానాశ్రయ నిర్మాణం కోసం 'శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్' ఏర్పాటుకు సన్నాహకాలు చేయాలని అంతకు ముందు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు.