ఆన్ లైన్లో పాఠాలు చెప్పమంటే అసభ్య సందేశాలు పంపారు... కీచక టీచర్ల అరెస్ట్

  • లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ బోధన
  • విద్యార్థిని ప్రశ్నలు అడిగితే అసభ్యకరంగా జవాబులు పంపిన టీచర్లు
  • టీచర్లను రిమాండ్ కు తరలించిన పోలీసులు
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ లో విద్యాబోధన జరుపుతుండడం తెలిసిందే. అయితే, ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆన్ లైన్ విద్యాబోధన పేరిట అసభ్య సందేశాలు పంపుతూ తమ కీచక నైజాన్ని బయటపెట్టుకున్నారు.

షాబాద్ కు చెందిన శ్రీకాంత్, సురేందర్ అనే టీచర్లు వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. ఓ 9వ తరగతి విద్యార్థిని అడిగిన ప్రశ్నలకు సవ్యరీతిలో సమాధానాలు చెప్పాల్సిందిపోయి, జుగుప్సాకర రీతిలో అసభ్య సమాధానాలు పంపారు. దాంతో ఆ విద్యార్థిని షీటీమ్ ను ఆశ్రయించింది. ఆ ఇద్దరు టీచర్ల అరాచకంపై వెంటనే స్పందించిన సైబరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు తెలిపారు.


More Telugu News