తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
- ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడి
- సెకండియర్ లో 68 శాతం ఉత్తీర్ణత
- ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ లో 60.1 శాతం ఉత్తీర్ణులవగా, సెకండియర్ లో 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 67.4 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 52.30గా నమోదైంది. సెకండియర్ లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ లో మేడ్చెల్ అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ లో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా జిల్లాలను వెనక్కినెట్టింది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ స్థాయి ఉత్తీర్ణత ఇదే ప్రథమం. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, bie.telangana.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.
కాగా, ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ ఫలితాల్లో గతేడాది పరిణామాలు పునరావృతం కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, ఎక్కడా పొరబాటు జరగకుండా ఒకటికి రెండు టెక్నాలజీలు ఉపయోగించామని చెప్పారు.