ఆ వ్యూహం ప్రకారమే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది: భారత ఆర్మీ మాజీ మేజర్‌ జనరల్‌ ద్వివేది

  • నియంత్రణ రేఖ వద్ద భారత్‌ నిర్మాణాలు చేపట్టకుండా చేయడం
  • లడఖ్‌ను స్వాధీనం చేసుకోవటమే చైనా ధ్యేయం
  • కొద్ది కొద్దిగా మన దేశ భూభాగంలోకి చొరబడే ప్రయత్నం
  • కరోనాపై చైనాపై అమెరికా వాదనలకు భారత్‌ మద్దతూ కారణమే
సరిహద్దుల్లో చైనా సైన్యం పాల్పడుతోన్న దుందుడుకు చర్యలపై భారత ఆర్మీ మాజీ మేజర్‌ జనరల్‌ జీజీ ద్వివేది  స్పందిస్తూ పలు విషయాలు తెలిపారు. వ్యూహం ప్రకారమే చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. నియంత్రణ రేఖ ప్రాంతంలో భారత్‌ ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకుండా చేయడంతో పాటు లడఖ్‌ను స్వాధీనం చేసుకోవటమే చైనా ధ్యేయమని ఆయన చెప్పారు.

ఓ వైపు ఉద్రిక్త పరిస్థితులపై చర్చలు జరుపుతూనే, మరోవైపు కొద్ది కొద్దిగా మన దేశ భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని వివరించారు. డ్రాగన్‌ దేశ నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో బాధపడుతున్నాయని అమెరికా చేస్తోన్న వాదనలకు భారత్‌ మద్దతు తెలపడమే చైనా మరోసారి లడఖ్‌లో దుందుడుకు చర్యలకు పాల్పడడానికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సైనిక బలంతో రాజకీయ లక్ష్యాలను సాధించడం, భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటమే చైనా వ్యూహమని చెప్పారు.


More Telugu News