చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో చేతులు కలపండి.. బాలీవుడ్ తారలకు, క్రీడాకారులకు సీఏఐటీ పిలుపు
- మరోసారి ఊపందుకున్న చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం
- అఖిల భారత వ్యాపారుల సమాఖ్య మద్దతు
- ప్రముఖులకు పిలుపు
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన వేళ చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదన్న ఉద్యమం మరోసారి ఊపందుకుంది. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికింది. దేశంలోని ప్రముఖులకు కీలక సూచనలు చేసింది.
దేశ ప్రయోజనాల దృష్ట్యా చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని, బాలీవుడ్ తారలు, క్రీడా రంగ ప్రముఖులు తమతో చేతులు కలిపి ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని సీఏఐటీ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా ఉత్పత్తులను వాడకూడదని పిలుపునిచ్చింది.