లోకేశ్‌ను ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి.. కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న
- తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడన్న విజయసాయిరెడ్డి
- వంటకాలు చేయించుకుని భోజనం చేసి చెక్కేశాడని చురక
- లోకేశ్ తనతో పాటు తెచ్చుకున్న క్యారెజ్ తిన్నారన్న బుద్ధా
- అది కూడా ఆకుకూరల భోజనం తిన్నారని వ్యాఖ్య
టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోజనం చేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
విజయసాయిరెడ్డి విమర్శల పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. 'లోకేశ్ కార్యకర్త కోసం ఎంత దూరం అయినా వెళ్లడం చూసి వణుకుతున్నావ్ ఏంటీ? విజయసాయిరెడ్డి గారు. తాడిపత్రిలో లోకేశ్ తనతో పాటు తెచ్చుకున్న క్యారెజ్ అది కూడా డైటింగ్ లో భాగమైన ఆకుకూరల భోజనం తిన్నారు. దీనిని కూడా రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నారు చూడు అది మీ తింగరి మాలోకం జగన్ రేంజ్' అని బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
'మీ తింగరి మాలోకం అవినీతి సొమ్ము బొక్కడానికి తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నాడు. ఓదార్పు అంటూ సోకాలు పెట్టాడు, పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేశాడు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరుపప్పే' అని విమర్శించారు.