ఇవాంకా ప్రయత్నాలకు విజయవంతంగా చెక్ పెట్టిన 'ఫస్ట్ లేడీ' మెలానియా!

  • మెలానియా జీవిత చరిత్ర పుస్తకం విడుదల
  • పుస్తకాన్ని రచించిన వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ జోర్డాన్
  • 'ఫస్ట్ లేడీస్ ఆఫీస్' పేరును 'ఫస్ట్ ఫ్యామిలీస్ ఆఫీస్'గా మార్చేందుకు  ప్రయత్నాలు
మెలానియా ట్రంప్... అమెరికాలో ఫస్ట్ లేడీ గౌరవాన్ని దక్కించుకున్న మహిళ. ఆమె కోసం వైట్ హౌస్ లో ఓ ప్రత్యేక ఆఫీసే ఉంటుంది. కానీ, ఆమె ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మూడవ భార్యన్న సంగతి అందరికీ తెలిసిందే. మరో ఐదు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి వున్న ట్రంప్, ఈ విషయంలో తన కుమార్తె ఇవాంక నుంచి చిక్కులు ఎదుర్కోనున్నారా? అందుకు మెలానియా జీవిత చరిత్ర కారణం అవుతోందా? అంటే, అవుననే అంటున్నారు నిపుణులు.

మెలానియా ట్రంప్ జీవిత చరిత్రను రాసిన 'వాషింగ్టన్ పోస్ట్' రిపోర్టర్ మేరీ జోర్డాన్, తన పుస్తకానికి 'ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్' పేరిట విడుదల చేశారు. ఈ పుస్తకంలో ఆమె రాసిన వివరాలను బట్టి, తన తల్లికి దక్కాల్సిస ఫస్ట్ లేడీ టైటిల్ ను మారుతల్లి అయిన మెలానియా అనుభవించడం ఏంటని ఇవాంకా ప్రశ్నించారట. అంతేకాదు 'ఫస్ట్ లేడీస్ ఆఫీస్' పేరును 'ఫస్ట్ ఫ్యామిలీస్ ఆఫీస్'గా మార్చేందుకు ఆమె ప్రయత్నించారట.

అయితే, ఇవాంకా ప్రయత్నాలను మెలానియా సమర్థవంతంగా అడ్డుకున్నారని, ప్రస్తుతం ట్రంప్ కు మెలానియా సింగిల్ మోస్ట్ ఇన్ ఫ్లూయన్షియల్ అడ్వయిజర్ అని జోర్డాన్ పేర్కొన్నారు. కాగా, ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో అవాస్తవాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఇవాంకకు మద్దతిచ్చే వారు విమర్శిస్తున్నారు. 


More Telugu News