అంత బాధగా ఉందా? అంటూ రాజ్ నాథ్ సింగ్ కు ఐదు ప్రశ్నలను సంధించిన రాహుల్ గాంధీ!

  • సైనికుల మృతి పట్ల ఈ ఉదయం సంతాపం ప్రకటించిన రాజ్ నాథ్
  • సంతాపం ప్రకటించడానికి రెండు రోజుల సమయం పట్టిందా అంటూ రాహుల్ మండిపాటు
  • చైనా పేరును ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం
సరిహద్దుల్లో సైనికులను కోల్పోవడం చాలా బాధను కలిగిస్తోందంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఉదయం చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. సైనికుల ప్రాణ త్యాగాలపై స్పందించేందుకు రెండు రోజుల సమయం పట్టిందా? అని మండిపడ్డారు. 'మీకు అంత బాధగా ఉంటే... ' అంటూ రాజ్ నాథ్ కు ఐదు ప్రశ్నలు సంధించారు.

  • మీ ట్వీట్ లో చైనా పేరును ప్రస్తావించకుండా ఇండియన్ ఆర్మీని ఎందుకు కించపరిచారు?
  • అమర జవాన్లకు సంతాపం ప్రకటించడానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది?
  • జవాన్లు అమరులవుతూ ఉంటే... వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ప్రసంగాలు ఎందుకు చేశారు?
  • మీ అనుకూల మీడియాతో ఆర్మీని విమర్శింపజేస్తూ ఎందుకు దాక్కున్నారు?
  • పెయిడ్ మీడియాతో భారత ప్రభుత్వానికి బదులు ఆర్మీపై ఎందుకు నిందలు వేయించారు? అని రాహుల్ ప్రశ్నించారు. అంతకు ముందు ప్రధాని మోదీపై కూడా రాహుల్ మండిపడ్డారు. ఇంత జరిగినా స్పందించకుండా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.


More Telugu News