రెచ్చగొడితే దీటైన సమాధానం చెపుతాం: చైనాకు మోదీ హెచ్చరిక

  • భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది
  • అమర జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వం
  • దేశ సార్వభౌమాధికారమే మాకు ముఖ్యం
లడఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు చేసిన దాడిలో మన సైనికులు 20 మంది అమరులయ్యారు. ఇదే సమయంలో చైనా సైనికులు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారత్ సీరియస్ గా తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని... రెచ్చగొడితే మాత్రం దీటుగా సమాధానం చెపుతామని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని అన్నారు.

చైనీయులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరులను చూసిన యావత్ దేశం గర్విస్తోందని మోదీ చెప్పారు. మన జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వమని అన్నారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యతే తమకు ప్రధానమని చెప్పారు.


More Telugu News