గాల్వన్ లోయ ఘర్షణలపై చైనా విదేశాంగ శాఖ వితండవాదం

  • గాల్వన్ లోయపై పూర్తి అధికారం తమదేనని ఉద్ఘాటన
  • ఘర్షణ చైనా భూభాగంలోనే జరిగిందని వెల్లడి
  • భారత్ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని వ్యాఖ్యలు
లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి ఇరువైపులా ప్రాణనష్టం చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది.

గాల్వన్ లోయపై పూర్తి అధికారం తమదేనని అసంబద్ధ వాదన వినిపిస్తోంది. ఘర్షణ ఘటన చైనా భూభాగంలోనే జరిగిందని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. సరిహద్దు ఒప్పందాలను భారత సైన్యం ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. భారత్ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని స్పష్టం చేసింది.


More Telugu News