చైనాతో ఉద్రిక్తతలపై.. ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

  • భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
  • ఇప్పటికే పలువురితో మోదీ చర్చ
  • దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో మాట్లాడనున్న మోదీ
  • శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌
భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ఈ క్రమంలో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ ‌లోయ వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. కాగా, గాల్వన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి.



More Telugu News