తొడగొట్టిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. శాసనమండలిలో తీవ్ర గందరగోళం!
- బీసీలను అణగదొక్కుతున్నారన్న నాగ జగదీశ్వరరావు
- ముద్రగడను టీడీపీ అరెస్ట్ చేయించిందన్న అనిల్
- ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ తో ఆయనకు కాసేపు వాగ్వాదం నడిచింది. ఈ సందర్భంగా మంత్రి ఆవేశానికి గురై... సభలో తొడగొట్టారు.
నాగ జగదీశ్వరరావు మండలిలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అంశాన్ని లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... అచ్చెన్న తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని అన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కల్పించుకుని... ముద్రగడ అంశాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమం సమయంలో మూడు వేల మంది పోలీసులతో ఆయనను అరెస్ట్ చేయించారని... దీన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన మంత్రి అనిల్ తొడగొట్టారు. తనను ఓడించేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని... అయినా తాను గెలిచి, సభకు వచ్చానని అన్నారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలగొనడంతో మండలి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.