మంచు లక్ష్మి కూతురు విద్యకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన హీరో ప్రభాస్!

  • ఆరవ పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్ చేసిన ప్రభాస్
  • సంబరపడ్డ విద్య
  • అభిమానులతో చెప్పిన మంచు లక్ష్మి 
సినీనటి మంచు ల‌క్ష్మి  కూతురు విద్యా నిర్వాణ తాజాగా ఆరవ పుట్టినరోజు వేడుక‌లు జరుపుకుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను మంచు లక్ష్మి తన ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసింది. తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా సినీ హీరో ప్రభాస్ ఓ గిఫ్ట్ ఇచ్చాడని ఆమె చెప్పింది. అదేమిటంటే, ఆమె పుట్టిన‌రోజు సందర్భంగా విద్యకు ప్ర‌భాస్ వీడియో కాల్ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడట.
                   
ఆమెతో కాసేపు మాట్లాడి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ  సందర్భంగా మంచు మోహన్‌ బాబు కుటుంబ సభ్యులతో కూడా ప్రభాస్‌ మాట్లాడారు. తనకు ప్రభాస్ ఫోన్‌ చేయడంతో తన కూతురు విద్య చాలా సంబరపడిందని మంచు ల‌క్ష్మి తెలిపింది.


More Telugu News