మన సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు!: రాజ్‌నాథ్ సింగ్
- జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది
- అత్యంత ధైర్యంతో శౌర్య పరాక్రమాలను కనబర్చారు
- వారి కుటుంబాలకు దేశం మొత్తం మద్దతు ఇస్తోంది
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. 'గాల్వన్‌లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మన జవాన్లు తమ విధుల నిర్వహణలో అత్యంత ధైర్యంతో శౌర్య పరాక్రమాలను కనబర్చారు' అని పేర్కొన్నారు.
'మన సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. అమరులైన జవాన్ల కుటుంబాలకు నేను సానుభూతి తెలుపుతున్నాను. ఈ బాధాకర పరిస్థితుల్లో వారికి దేశం మొత్తం మద్దతు ఇస్తోంది. మన దేశ యోధులను చూసి గర్విస్తున్నాం' అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.