బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలంటే ఇవన్నీ చేయాలి.. లేకపోతే కష్టాలు తప్పవు: శ్రద్ధాదాస్

  • పార్టీలకు వెళ్లాల్సి ఉంటుంది
  • ఖరీదైన క్లబ్బులకు వెళ్లాలి
  • అక్కడి వారితో స్నేహాలు చేసుకోవాలి
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత... బాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయంపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. పైకి కనిపించేంత అందంగా బాలీవుడ్ కానీ, అక్కడి వ్యక్తుల మనసులు కానీ ఉండవనే విషయాన్ని బయటకు వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై నటి శ్రద్ధాదాస్ పలు విషయాలను వెల్లడించింది.  

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనివారు బాలీవుడ్ లో నిలబడటం చాలా కష్టమని నటి శ్రద్ధాదాస్ తెలిపింది. మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్లు ఇండస్ట్రీలో ఎదగలేరని స్పష్టం చేసింది. ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలనుకుంటే పార్టీలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. బాంద్రా, జుహూ ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్ లకు వెళ్లాల్సి ఉంటుందని  చెప్పింది. అక్కడున్న వారితో స్నేహంగా మెలగాలని తెలిపింది. మేల్ యాక్టర్లకు కూడా ఇవే ఇబ్బందులు ఉంటాయని చెప్పింది.

పీఆర్ మేనేజర్లకు డబ్బులు ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని... డబ్బు తీసుకుని వారు చెప్పేది కూడా ఇదేనని చెప్పింది. వారు కూడా పార్టీలకు వెళ్లమనే సూచిస్తారని తెలిపింది. దుస్తులు, షూస్, సెలూన్, స్టయిలిస్ట్, పీఆర్, కార్లు తదితర ఖర్చులను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్లు భరించలేరని చెప్పింది. వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుందని... అసలు ఈ రంగంలోకి ఎందుకొచ్చామా? అని అనిపిస్తుందని తెలిపింది. బాలీవుడ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వెల్లడించింది.


More Telugu News