వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు!: విజయసాయిరెడ్డి

  • ఈఎస్‌ఐ కేసు విచారణపై స్పందన
  • అచ్చెన్న బెదిరింపుల వల్లే రూల్స్ కు విరుద్ధంగా కొనుగోలు
  • ఈ విషయాన్ని ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు చెప్పారట
  • వార్నింగులిచ్చి తప్పు చేయించాడని బయట పెట్టారట
ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ అధికారులు టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌లతో నిధులు కాజేశారని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఈ కేసు నమోదైంది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

'అచ్చెన్న బెదిరింపుల వల్లే రూల్స్ కు విరుద్ధంగా కొనుగోలు చేశామని  ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు చెప్పారంట. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్ సైడ్ స్టోరీలు బయట పెట్టారంట. వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో?' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


More Telugu News