ఈ పరిస్థితుల్లో ముంబైకా... అబ్బే.. కష్టం!: నితిన్ గడ్కరీ
- అత్యధిక కేసులతో దేశంలోనే ముందున్న మహారాష్ట్ర
- ముంబైలో గత 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు
- పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న కేంద్ర మంత్రి గడ్కరీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ముంబై వెళ్లే సాహసం చేయబోనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ముంబైలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై వెళ్లే ధైర్యం తనకు లేదని, అయితే, త్వరలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయి. అత్యధిక కేసులతో దేశంలోనే మహారాష్ట్ర ముందుంది.
ఇప్పటి వరకు అక్కడ 1,10,744 కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత 24 గంటల్లోనే ఏకంగా 1,067 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తలను ‘మహా’ సీఎం ఉద్ధవ్ థాకరే ఖండించారు. అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు.