అనసూయ ఔదార్యం... పోచంపల్లి చేనేత కళాకారులకు సాయం

  • 40 మందికి నిత్యావసరాలు పంపిణీ
  • నేతన్నల ఆకలి బాధ తనను కలచివేసిందని వెల్లడి
  • మంచిరోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ధైర్యం చెప్పిన అనసూయ
పోచంపల్లి చేనేత కళాకారుల నైపుణ్యం అంతర్జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందింది. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో పోచంపల్లి చేనేత కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. వారి పరిస్థితి పట్ల ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ చలించిపోయారు. అందుకే తనవంతుగా వారికి సాయం అందించారు.

ఇవాళ పోచంపల్లిలో 25 కిలోల బియ్యం, కిలో నూనె, 5 కిలోల కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. 40 మంది నిరుపేద చేనేత కార్మికులకు ఈ నిత్యావసరాలు అందించారు. దీనిపై అనసూయ వ్యాఖ్యానిస్తూ, పోచంపల్లి తన అస్తిత్వం అని పేర్కొన్నారు. పోచంపల్లి చేనేత కళాకారుల ఆకలి బాధల వార్త తనను కలవరానికి గురిచేసిందని తెలిపారు. మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ధైర్యంగా ఉండాలని నేతన్నలకు సూచించారు. "మీరు, మీ చేనేత నైపుణ్యం నా గర్వం" అంటూ అనసూయ ట్వీట్ చేశారు.



More Telugu News