రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కోర్టులను వ్యతిరేకిస్తూనే ఉంది: గల్లా జయదేవ్

  • సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
  • సీఆర్డీఏ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై గల్లా అభ్యంతరం
  • ఈ బిల్లు కోర్టు పరిధిలో ఉందని వెల్లడి
ఏపీ సర్కారు ఇవాళ అనేక బిల్లులకు చట్టసభలో ఆమోద ముద్ర వేయించుకుంది. సీఆర్డీయే రద్దు, మూడు రాజధానుల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లు కోర్టు పరిధిలో ఉందని, అలాంటి బిల్లును ఆమోదించడం అంటే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ పట్ల వైసీపీ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేటతెల్లమవుతోందని ట్వీట్ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.


More Telugu News