ఎవరైనా తమ అల్లుడికి ఆస్తిని కట్నంగా ఇస్తారు... మరి ఏ2 తన అల్లుడికి ఏమిస్తున్నారో చూడండి: నారా లోకేశ్

  • అంబులెన్స్ ల్లోనూ అవినీతి అంటూ విమర్శలు
  • ఏ2 తన అల్లుడి కోసం కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారని వెల్లడి
  • ఇందులో ఏ1 వాటా ఎంతో? అంటూ లోకేశ్ సందేహం
ఆపదలో ఆదుకునే అంబులెన్స్ లను కూడా అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఎవరైనా తమ అల్లుడికి ఆస్తిని కట్నంగా ఇస్తారని, కానీ ఏ2 మాత్రం 108 అంబులెన్స్ కాంట్రాక్టు ద్వారా కొట్టేస్తున్న రూ.856 కోట్ల ప్రజాధనం అల్లుడికి కట్నంగా ఇస్తున్నారని ఆరోపించారు. ఏ2 గారిది అవినీతికి బాగా అలవాటైన ప్రాణం అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒక్కో అంబులెన్స్ కు రూ.1.31 లక్షల చొప్పున ఐదేళ్లకు తీసుకున్న కాంట్రాక్టును రద్దు చేసి అల్లుడి కంపెనీకి రూ.2.21 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఐదేళ్లలో రూ.856 కోట్లు దోచిపెడుతున్నారని వివరించారు. ఇందులో ఏ1 వాటా ఎంతో? అంటూ నారా లోకేశ్ సందేహం వ్యక్తం చేశారు.


More Telugu News