ఈ మంత్రిని చూస్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తోంది: చంద్రబాబు

  • మంత్రి బుగ్గనపై చంద్రబాబు విమర్శలు
  • పెద్ద పెద్ద గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా
  • పొగడ్తలకు అంతేలేదని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అవాస్తవాలే చెబుతున్నారని విమర్శించారు.

"ఈ మంత్రిని చూస్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తోంది. వీళ్లే పుట్టినట్టు, వీళ్లే చేసినట్టు అంతా పొగడడం తప్ప మరేమీ కనిపించలేదు. పెద్ద పెద్ద గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. పొగడ్తలకు అంతులేకుండా పోయింది. 2018-19లో మూలధన వ్యయం రూ.19,976 కోట్లు కాగా, 2019-20లో రూ.12,845 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు. అది కూడా వాస్తవ గణాంకాలు కాదు, రివైజ్డ్ లెక్కలు.

వీళ్లు చెబుతున్న లెక్కల ప్రకారం సాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విభజన అప్పులన్నీ కలిపి 2018-19 నాటికి రూ.2.55 లక్షల అప్పులున్నాయి. ఇప్పుడది రూ.3.02 లక్షల కోట్లు అయింది. వచ్చే ఏడాదికి రూ.3.50 లక్షల కోట్లు అవుతుంది. వీళ్లు దగ్గరదగ్గర లక్ష కోట్ల రూపాయలు పెంచేశారు. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.1,14,670 కోట్లు అయితే, ఇప్పుడది రూ.1.10 లక్షల కోట్లకు తగ్గిపోయింది. గతేడాది వరకు మనకు కరోనా వైరస్ లేదు. కరోనా వచ్చింది మార్చిలో. మీరు అప్పు తెచ్చారు తప్ప, ఆదాయం తెచ్చుకున్నది లేదని అర్థమవుతోంది. విశ్వసనీయత లేని మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు" అంటూ విమర్శించారు.


More Telugu News