ఓపక్క భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొస్తూ.. మరోపక్క నిందలేస్తున్న డ్రాగన్!
- భారత్-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- నిన్న రాత్రి ఘర్షణల్లో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయిన వైనం
- 1975 తర్వాత ఈ స్థాయిలో ఘర్షణ పడటం ఇదే తొలిసారి
భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లడక్ లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులు సరిహద్దును దాటి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో మన సైన్యానికి చెందిన కల్నల్, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ సందర్బంగా భారత సైనికాధికారులు మాట్లాడుతూ, చైనా దుందుడుకు చర్యలను భారత్ అడ్డుకుందని... చైనా సైనికులు కూడా ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. అయితే తుపాకి కాల్పులు చోటుచేసుకోలేదని... రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడం వంటివి చోటుచేసుకున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో, చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' మీడియా కథనం ప్రకారం ఈరోజు మళ్లీ ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భారత బలగాలు ఈరోజు మళ్లీ నియంత్రణ రేఖను (ఎల్ఓసీ) దాటుకుని తమ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని చైనా ఆర్మీ అధికారి చెప్పినట్టు సదరు పత్రిక రాసింది. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నట్టు కూడా పేర్కొంది. అయితే, చైనా బుద్ధి ఏమిటన్నది ప్రపంచానికి తెలిసిందే. సరిహద్దుల్లో భారత్ ఎంతటి సంయమనాన్ని పాటిస్తుందన్నది కూడా ప్రపంచానికి తెలుసు.