వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ ప్రకటన లోగుట్టు ఇదే!: కన్నా
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటన
- రాష్ట్రానికి రివర్స్ గేరు వేశారంటూ విమర్శలు
ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ సర్కారు రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ చూస్తుంటే ప్రచారం ఘనం, చేతలు శూన్యం అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రకటన లోగుట్టు ఇదేనని వ్యంగ్యం ప్రదర్శించారు.
కేంద్ర నిధులతో ఉన్న పథకాలకు సొంత స్టిక్కర్లు వేశారని, ఏడాదిగా ఇదే తంతు జరుగుతోందని వెల్లడించారు. ఖజానా ఖాళీ చేసి అప్పులు చేస్తూ, ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారని కన్నా ఆరోపించారు. రాష్ట్ర పరిపాలనపై అవగాహనలేక కోర్టు మొట్టికాయలు తింటూ అభివృద్ధి అనేదే లేకుండా రాష్ట్రానికి రివర్స్ గేరు వేశారంటూ ట్వీట్ చేశారు.