లడఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను ప్రధాని మోదీకి వివరించిన రాజ్ నాథ్
- సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ
- ఇరువైపులా ప్రాణనష్టం
- తదుపరి వ్యూహంపై మోదీతో చర్చించిన రాజ్ నాథ్
సరిహద్దుల్లో చైనా దుందుడుకుతనం, ఉద్రిక్తతలు కొత్తేమీకాదు. అయితే తాజాగా జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడంతో భారత్, చైనా మధ్య ఆందోళనపూరిత వాతావరణం ఏర్పడింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ప్రధానికి వివరించారు. చైనా వైఖరిపై తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు.