లడఖ్ వద్ద ఐదుగురు చైనా సైనికులు చనిపోయారంటున్న 'గ్లోబల్ టైమ్స్'

  • గతరాత్రి గాల్వన్ లోయ వద్ద ఘర్షణ
  • ముగ్గురు చైనా సైనికులు మరణించారని భారత ఆర్మీ వెల్లడి
  • భిన్న వాదనలు వినిపిస్తున్న 'గ్లోబల్ టైమ్స్'
సరిహద్దుల వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు కొత్తకాదు. కానీ గత రాత్రి జరిగిన ఘర్షణ ఇరుదేశాల సైనికుల్లో ప్రాణనష్టం కలిగించింది. సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పేందుకు అదనపు బలగాలను ఉపసంహరిస్తున్న తరుణంలో ఈ ఘర్షణ జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 ఇక ఈ ఘటనలో రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందన్న భారత ఆర్మీ... ముగ్గురు చైనా సైనికులు మరణించారని పేర్కొంది. అయితే, చైనా మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్' భిన్న వాదనలు వినిపిస్తోంది. లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మందికి గాయాలయ్యాయని ఓ కథనంలో పేర్కొంది. 'గ్లోబల్ టైమ్స్' సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదని కూడా ఆ మీడియా సంస్థ తెలిపింది.


More Telugu News