జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం

  • రాష్ట్రంలో పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష సమావేశం
  • తెలంగాణలో కరోనా ఉద్ధృతి
  • ప్రారంభమైన రుతుపవనాల సీజన్
  • నియంత్రిత సాగుపై సీఎం విస్తృత చర్చ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకు పెరిగిపోతుండడం, ఓవైపు నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ రంగానికి ఊతమివ్వాల్సిన సమయం దగ్గరపడడం వంటి అంశాలపై సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు.

 హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు వేసే విధంగా ప్రోత్సహించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ నియంత్రిత సాగుపై జిల్లా కలెక్టర్లతో మరింత విస్తృతంగా చర్చిస్తున్నారు. రైతు బంధు పథకం కింద రైతులకు అందాల్సిన సాయం పది రోజుల్లో పూర్తవ్వాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ రంగంపైనా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు అందజేశారు.


More Telugu News