రూ. 2,24,789.18 కోట్లతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్లో సంక్షేమ పథకాలకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాలకు భారీ కేటాయింపులు చేసింది. ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్ ఇవే
న్యాయశాఖకు - రూ. 913.76 కోట్లు
విద్యుత్ రంగానికి - రూ. 6,984.72 కోట్లు
ఆర్థిక రంగానికి - రూ. 50,703 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి - రూ.2,055.63 కోట్లు
ప్రణాళిక రంగానికి - రూ.515.87 కోట్లు
పర్యావరణం, అటవీశాఖకు - రూ.457.32 కోట్లు
సోషల్ వెల్ఫేర్ కు - రూ.12,465.85 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు - రూ. 22,604.01 కోట్లు
సాధారణ పరిపాలనకు - రూ.878.01 కోట్లు
కాపుల సంక్షేమానికి - రూ.2,846.47 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు - రూ.425.93 కోట్లు