ఏపీ శాసనమండలి సమావేశాలు మూడ్రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం
- ఏపీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం
- ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో చెప్పాలన్న టీడీపీ సభ్యులు
- సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రవేశపెట్టడం సరికాదని హితవు
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శాసనమండలి బీఏసీ సమావేశం నిర్వహించారు. పలు బిల్లులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మూడ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సభలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో సమాచారం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఒకవేళ సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాదని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. అటు, ఏపీ అసెంబ్లీని రెండ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.