మహిళలంటే ఇంత చులకన భావం ఎందుకు బాబు మీకు?: విజయసాయిరెడ్డి

  • మున్సిపల్ అధికారిణిని అయ్యన్నపాత్రుడు బెదిరించారు
  • ఇంకా మీకు పొగరు తగ్గినట్టు లేదు
  • సాయం కోసం వెళ్తే అచ్చెన్న తన్నాడని ఓ మహిళ వాపోయింది
  • వనజాక్షిని చింతమనేని కొట్టింది ఎవరూ మర్చిపోలేదు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ పార్టీపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలపై స్పందిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎదురుదాడికి దిగారు. మహిళలంటే టీడీపీ నేతలకే చులకన భావం ఉందని ఆయన విమర్శించారు.

'మహిళలంటే ఇంత చులకన భావం ఎందుకు బాబు మీకు, మీ మాజీలకు. మున్సిపల్ అధికారిణిని అయ్యన్నపాత్రుడు బెదిరించడం చూస్తే పొగరు తగ్గినట్టు లేదు. సాయం కోసం వెళ్తే అచ్చెన్న డొక్కలో తన్నాడని ఓ మహిళ వాపోయింది. తహసీల్దార్ వనజాక్షిని చింతమనేని కొట్టింది ఎవరూ మర్చిపోలేదు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.


More Telugu News