లడఖ్‌లో కలకలం... చైనా బలగాలతో ఘర్షణలో ముగ్గురు భారత సైనికుల మృతి.. తీవ్ర ఉద్రిక్తత

  • గాల్వన్‌ లోయ వద్ద ఘటన
  • నిన్న రాత్రి నుంచి భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ
  • ఇరు దేశాల సైనికుల ఉపసంహరణ ప్రక్రియ సమయంలో ఉద్రిక్తత
ఓ వైపు చైనా శాంతి మంత్రం జపిస్తూనే, మరోవైపు దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లడఖ్‌లో మరోసారి కలకలం చెలరేగింది. చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు. మరోసారి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద నిన్న రాత్రి నుంచి భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది.

'గాల్వన్‌ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోన్న సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురు భారీతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరు దేశాల అగ్రశేణి ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అని భారత ఆర్మీ అధికారి ఒకరు ప్రకటన చేశారు.


More Telugu News