సుశాంత్‌ను క్రికెటర్‌గా పేర్కొన్నారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు.. నకిలీ ట్వీటని చెబుతున్న కాంగ్రెస్
- సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ ట్వీట్
- మార్ఫింగ్ చేసిన కొందరు
- అది రాహుల్ ట్వీట్ కాదని చెప్పిన కాంగ్రెస్ మద్దతుదారులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనను క్రికెటర్‌గా పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారంటూ ఓ నకిలీ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. యువకుడు, మంచి నైపుణ్యాలు కలిగిన క్రికెటర్ మృతి పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు అందులో ఉంది.
కొందరు వైరల్ చేస్తోన్న ఈ స్క్రీన్ షాట్‌పై నెటిజన్లు సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి నాలెడ్జ్ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై రాహుల్ మద్దతుదారులు స్పందిస్తూ ఆ ట్వీట్ నకిలీదని, రాహుల్ చేసిన ఒరిజినల్ ట్వీట్ అదికాదని చెబుతున్నారు. ఆ రెండు ట్వీట్లను కలిపి పోస్ట్ చేస్తూ వివరణ ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొందరు ఫొటో షాప్ చేసి వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు.