ఒక్క చాన్స్ అంటూ వచ్చి... ఇంత అధోగతా?: నిమ్మల రామానాయుడు
- ప్రభుత్వానికి నిరసనగానే గవర్నర్ ప్రసంగం బాయ్ కాట్
- కరోనా వస్తే పారాసిట్మాల్ చాలనే ముఖ్యమంత్రి జగన్
- వైరస్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న నిమ్మల
తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్, ఏడాది వ్యవధిలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉప నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తమ పార్టీ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన అన్నారు. అందుకు నిరసనగానే నేడు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశామని తెలిపారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, పారాసిట్మాల్ టాబ్లెట్ చాలన్న ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తుండటానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని నిప్పులు చెరిగిన ఆయన, పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కొనుగోలు, అమ్మకాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఆయన, మద్యపానాన్ని నిషేధిస్తామంటూ, జే టాక్స్ గ్యాంగ్ లను జగన్ రంగంలోకి దింపారని అన్నారు.
లాక్ డౌన్ సమయంలో మందుకు దూరంగా ఉన్న పేదలకు మళ్లీ మద్యం అలవాటు చేయిస్తున్నారని నిప్పులు చెరిగిన రామానాయుడు, ఇసుక మాఫియాను రంగంలోకి దించి, సామాన్యుల గృహ నిర్మాణాలకు ఇసుకను దూరం చేశారని అన్నారు. జగన్ సర్కారు తన సొంత ప్రయోజనాల కోసమే బడ్జెట్ పేరిట సమావేశాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ వైఫల్యాలను తాము నిలదీస్తామని స్పష్టం చేశారు.