మద్యం మత్తులో విమానం కిటికీని పగులగొట్టిన అమ్మాయి.. అత్యవసర ల్యాండింగ్
- లూంగ్ ఎయిర్‌లైన్స్‌లో గ్జినింగ్ నుంచి యాచ్చెంగ్కు వెళ్తుండగా ఘటన
- ప్రేమ విఫలమైందన్న బాధలో యువతి ఆవేదన
- అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న పోలీసులు
మద్యం మత్తులో ఉన్న ఓ యువతి తాను ప్రయాణిస్తోన్న విమానం కిటికీని పగులగొట్టిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇటీవల ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
చైనాకు చెందిన లీ (29) ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే, అమె ప్రేమను అతడు తిరస్కరించడంతో ఆమె మనసు ముక్కలైంది. ప్రేమ విఫలమైందన్న బాధతో ఆమె కుంగిపోతోంది. ఇటీవల లూంగ్ ఎయిర్‌లైన్స్‌లో గ్జినింగ్ నుంచి యాచ్చెంగ్కు వెళ్తుండగా మద్యం తాగింది.
ప్రియుడిని గుర్తు తెచ్చుకుని ఆ బాధలో విమానం కిటికీని పిడికిలితో కొడుతూ పగులకొట్టే ప్రయత్నం చేసింది. దీంతో విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అయితే, అప్పటికే విమానం కిటికీ స్వల్పంగా పగిలిపోవడంతో దాన్ని జెంగ్చూ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపారు.