హెచ్‌సీయూ ఉద్యోగి హత్యకేసును ఛేదించిన పోలీసులు
- హెచ్‌సీయూలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ
- ఈ నెల 6న హిమాయత్ సాగర్ చెరువు వద్ద హత్య
- రూ. 4 వేల కోసం చంపేసిన నిందితుడు
ఈ నెల 6న హత్యకు గురైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హెచ్‌సీయూ సెక్షన్ ఆఫీసర్ అయిన సత్యనారాయణ (56) గండిపేట మండలం హైదర్షాకోట్‌లో నివసిస్తున్నాడు. ఈ నెల 6న ఉదయం బండ్లగూడలోని ఓ కాంపౌండ్ వద్ద కల్లు తాగాడు. అదే సమయంలో ఖలిస్థాన్ దర్గాకు చెందిన మహ్మద్ అజీమ్ (32) వచ్చాడు.
సత్యనారాయణ వద్ద డబ్బులు ఉన్నట్టు గుర్తించిన అజీమ్ ఆయనతో మాటలు కలిపాడు. కల్లు తాగుదామని నమ్మించి స్కూటీపై హిమాయత్‌సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సత్యనారాయణను కిందపడేసి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం ఆయన పర్సులో ఉన్న రూ. 4 వేలు తీసుకుని అక్కడి నుంచి సత్యనారాయణ స్కూటీపై పరారయ్యాడు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సత్యనారాయణను హత్య చేసింది అజీమేనని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేవలం నాలుగువేల రూపాయల కోసమే హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.